Chevella road accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద సోమవారం వేకువజామున జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లారీ ఎదురెదురుగా ఢీకొట్టడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. ఢీకొట్టిన ప్రభావంతో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమై, లారీలోని కంకర బస్సులో పడిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అధికారులు తేల్చారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, టిప్పర్ లారీ అతివేగంతో రాంగ్ రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్లక్ష్య డ్రైవింగ్‌ను తీవ్రంగా ఖండించారు.
ఇది వరుసగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బస్సు ప్రమాదాల్లో మరో ఘోర ఘట్టంగా నిలిచింది. గత పది రోజుల్లోనే 60 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం రహదారి భద్రతపై తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలుపుతూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా రోడ్డు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
At least 16 people died when a truck with a load of gravel rammed into a RTC bus coming from the opposite direction at Mirjaguda near Chevella in Vikarabad district of Telangana on Monday.
According to Chevella ACP B Kishan, the RTC bus started at Tandur and it was supposed to… pic.twitter.com/Gj90drWbQp
— TOI Hyderabad (@TOIHyderabad) November 3, 2025