Chiranjeevi Praised Naveen Polishetty: ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సినిమాలు విడుదల అవుతున్నాయి, వాళ్ళ మధ్యలోకి రావడం ఎందుకులే అనే భయం లేకుండా, ధైర్యంగా సంక్రాంతి బరిలో నిలిచి, కేవలం నాలుగు రోజుల్లోనే ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రానికి బ్రేక్ ఈవెన్ రప్పించాడు హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty). ఇదొక అరుదైన రికార్డు గా ఆయన జీవితం లో నిలిచిపోతుంది. చిన్నప్పటి నుండి చిరంజీవి, ప్రభాస్ సినిమాలు చూస్తూ పెరిగిన నవీన్ పోలిశెట్టి, వాళ్ళతో పోటీ పడుతూ సక్సెస్ ని అందుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. అందుకే ఈ సంక్రాంతికి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచాడు ఆయన. అయితే కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడం లో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందు ఉంటాడు. తన సొంత కుటుంబం లో ఉన్న హీరోలు హిట్ కొడితే ఆయనకు ఎంత సంతోషంగా ఉంటుందో, కొత్త కుర్రాడు హిట్ కొడితే ఆయనకు అదే రేంజ్ సంతోషం కలుగుతుంది.
గతం లో ఇదే సంక్రాంతికి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం విడుదలై భారీ హిట్ అయ్యింది. ఆ చిత్రానికి పోటీగా శర్వానంద్ ‘శతమానం భవతి’ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ సమయం లో మెగాస్టార్ చిరంజీవి మూవీ టీం ని అభినందించడమే కాకుండా, స్వయంగా సక్సెస్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొని టీం ని ఆశీర్వదించాడు. ఇప్పుడు కూడా దాదాపుగా అదే చేసాడు మెగాస్టార్. రీసెంట్ గానే హైదరాబాద్ లో ‘అనగనగా ఒక రాజు’ సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ బాబీ ఒక అతిథిగా పాల్గొన్నాడు. త్వరలోనే బాబీ మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి తో కథ గురించి చర్చలు నడుపుతున్నప్పుడు ‘అనగనగా ఒక రాజు’ గురించి మాట్లాడాడు అట.
ఆ అంశం గురించి ఈ సక్సెస్ మీట్ లో బాబీ ప్రస్తావిస్తూ ‘నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నవీన్. మెగాస్టార్ చిరంజీవి తో నేను త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను. అందుకోసం రీసెంట్ గానే మా మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఆయన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం చాలా బాగుంది అంట కదా బాబీ అది అడిగాడు. అప్పుడు నేను అవును సార్ అని చెప్పాను. ఆ అబ్బాయి నవీన్ పోలిశెట్టి ఎంత ఎనర్జీ గా, ఎంత అద్భుతంగా చేస్తాడు. ఇప్పుడు వస్తున్నా కుర్రాళ్లలో నాకు బాగా నచ్చిన హీరో అతను అని చెప్పాడు. ఇది నేను ఇప్పటి వరకు నీతో చెప్పలేదు. ఈ సక్సెస్ మీట్ లో రివీల్ చేస్తే బాగుంటుందని ఇక్కడ చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బాబీ. పూర్తి వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి.