Varanasi vs Hanuman 2: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ నిన్న అధికారిక ప్రకటన చేశారు. చాలా సింపుల్ గా, ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఈ విడుదల తేదీని ప్రకటించడం పై మహేష్ ఫ్యాన్స్ లో కాస్త అసంతృప్తి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారమవుతున్న మరో ఆసక్తికరమైన వార్త పెద్ద చర్చకు దారి తీసింది. ‘వారణాసి’ కి పోటీగా ఏప్రిల్ 9న ‘హనుమాన్ 2’ ని విడుదల చేయబోతున్నారట. 2024 సంక్రాంతిని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’, తేజ సజ్జ హీరో గా నటించిన ‘హనుమాన్’ చిత్రాలు విడుదల అయ్యాయి.
మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి. దీంతో ‘గుంటూరు కారం’ పై ఫ్యాన్స్ లో, ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉండేవి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయి లో జరిగింది. అలాంటి సినిమాకు పోటీగా వచ్చింది ‘హనుమాన్’. విడుదలకు ముందు ‘అంత పెద్ద కాంబినేషన్ సినిమాతో పోటీ అవసరమా?, కనీసం థియేటర్లు కూడా ఇవ్వరు’ అని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్టుగానే ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అయ్యాయి, హనుమాన్ కి థియేటర్స్ రానివ్వకుండా చేశారు. అయినప్పటికీ ఆ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం తో, ‘గుంటూరు కారం’ లాంటి భారీ చిత్రాన్ని మొదటి రోజు నుండే డామినేట్ చేయడం మొదలు పెట్టింది. మొదటి వారం మొత్తం తక్కువ థియేటర్స్ తోనే ఈ చిత్రం రన్ అయ్యింది.
అయినప్పటికీ కూడా గుంటూరు కారం ని డామినేట్ చేస్తూ సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంది. గుంటూరు కారం చిత్రానికి క్లోజింగ్ లో 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ‘హనుమాన్’ చిత్రానికి ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పటి నుండి మహేష్ బాబు పై సోషల్ మీడియా లో యాంటీ ఫ్యాన్స్ నుండి ట్రోల్స్ మామూలు రేంజ్ లో పడలేదు. తేజ సజ్జ చేతిలో ఓడిపోయిన మహేష్ బాబు అంటూ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ‘వారణాసి’ కి పోటీగా ‘హనుమాన్ 2’ రాబోతుంది అనే వార్తలు రావడం తో ‘ఈ తేజ సజ్జ మహేష్ బాబు పై ఇంత పగబట్టేసాడు ఏంటి?, వదిలేలా లేడుగా’ అంటూ మరోసారి యాంటీ ఫ్యాన్స్ మీమ్స్ చేయడం మొదలు పెట్టారు.