
తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. మంగళవారం సాధన దీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా సీఎం జగన్ కు ఉంటే ఆ చట్టాలే సరిపోతాయని అన్నారు. లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్ ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోకుండా సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని ఎద్దేవా చేశారు.