https://oktelugu.com/

ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

నెల్లూరు జిల్లా పైడేరు కాలువలో వైకాపా నేతల మట్టి మాఫియాను ప్రశ్నించినందుకు మల్లికార్జున్ అనే ఎస్సీ యువకుడిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని తేదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మల్లికార్జున్ ను తప్పుడు కేసులో ఇరికించిన కొడవలూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి ఎస్సీ యువకుడిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా […]

Written By: , Updated On : June 20, 2021 / 03:42 PM IST
Chandrababu
Follow us on

Chandrababu

నెల్లూరు జిల్లా పైడేరు కాలువలో వైకాపా నేతల మట్టి మాఫియాను ప్రశ్నించినందుకు మల్లికార్జున్ అనే ఎస్సీ యువకుడిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని తేదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మల్లికార్జున్ ను తప్పుడు కేసులో ఇరికించిన కొడవలూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి ఎస్సీ యువకుడిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా పోలీసుల చర్యలు ఉన్నాయని తెలిపారు.