
మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వ్యయాన్ని ప్రత్యేక్ష నగదు బదిలీ ద్వారా అర్హలైన 11.8 కోట్ల మంది పిల్లలకు నగదు సాయం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశంక్ ఆమోదించారు. మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమానికి ప్రేరణను ఇవ్వనుంది. ఇది ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది లబ్థిదారులకు ఒక్కొక్కరికీ 5 కీలోల చొప్పున ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ గురించి భారత ప్రభుత్వం చేసిన ప్రకటనకు ఇది అదనం.