
పుడితే లంచం.. చస్తే లంచం.. బతకాలన్న లంచం.. ఆస్పత్రికెళితే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. భారత్ లో బతకాలంటే బహుభారం. అందుకే మన దేశంలో సంపాదన కోసం అందరూ వెర్రితలలు వేస్తారు. అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలకు పాల్పడుతారు.
కానీ కామన్ వెల్త్ దేశంలో విద్య, వైద్యం ఫ్రీ. అక్కడి వారికి బోలెడు సౌకర్యాలున్నాయని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. కామన్ వెల్త్ దేశాలైన యూరప్, కెనడా, ఆస్ట్రేలియాలో పుడితే పిల్లలందరికీ చదువు ఉచితం. పై చదువులు చదువుతామంటే ప్రభుత్వం నుంచి లోక్ తీసుకొని ఉద్యోగం వచ్చాక మెల్లగా తీర్చాలి. స్కాట్లాండ్ లో అయితే ఎంత చదవినా.. ఎన్నేళ్లు చదివినా పూర్తిగా ఉచితమే.
ఇక ఆరోగ్యం గురించి ఆ దేశాల్లో చింతనే లేదు. ప్రతిరోగికి ఒక వైద్యుడిని పెట్టి అతడు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ లో ఇంటి వద్ద ఉండే వరకు అతడి అవసరాలు, ఇతర వ్యవహారాలకు డబ్బులు కూడా ప్రభుత్వాలు ఇచ్చి చివరి వరకు చూసుకుంటారు. రెసిడెన్షియల్ కేర్ గా పిలవడమే దీనికోసం ప్రజల వైద్య కోసం ప్రభుత్వాలు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడుతాయట..దీంతో అక్కడి ప్రజలు డబ్బు కోసం వెంపర్లాడకుండా అవినీతి చేయకుండా సంపాదిస్తారు. మనశ్శాంతిగా బతకాలంటే ఆదేశాల్లో జీవించాలని పూరి తన ‘మ్యూజింగ్స్’ యూట్యూబ్ చానెల్ లో చెప్పుకొచ్చాడు.
అంతేకాదు.. అలాంటి హెల్త్ కేర్ సిస్టమ్ మన ఇండియాలో కూడా రావాలని పూరి జగన్నాథ్ కోరడం విశేషం.