
కనీస వేతనాలు, జాతీయ ప్రామాణిక వేతనాలను నిర్ణయించే విషయంలో జాప్యం చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆలస్యం చేసే ఉద్దేశంతోనే కనీస వేతనాల నిర్ణయానికి నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందంటూ వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టతనిచ్చింది. కనీస వేతన అంశంపై ప్రముఖ ఆర్థిక వేత్త అజిత్ మిశ్రా నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని కేంద్రం ఇటీవల నియమించింది.