కేసీఆర్, కరోనా.. అందరికీ అంటించేశాడా?

కరోనా.. మా చెడ్డది.. మొండిది.. గట్టిది.. దానికి రాజు పేద తేడా లేదు.. అందరినీ సమానంగా చూస్తుంది. దోమకు ఎలాగైతే తరతమ బేధాలు లేవో ఈ కరోనా కూడా అంతే.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు అంటించేస్తుంది.. ఆయన సభకు వచ్చిన సామాన్య ప్రజానీకానికి కూడా వ్యాపిస్తుంది. అందుకే ‘కరోనాను’ ఇప్పుడు యూనివర్సల్ వైరస్ గా ప్రకటించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇంతకీ ఈ సోది అంతా ఎందుకంటే.. కేసీఆర్ అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఆయనను […]

Written By: NARESH, Updated On : April 22, 2021 4:19 pm
Follow us on

కరోనా.. మా చెడ్డది.. మొండిది.. గట్టిది.. దానికి రాజు పేద తేడా లేదు.. అందరినీ సమానంగా చూస్తుంది. దోమకు ఎలాగైతే తరతమ బేధాలు లేవో ఈ కరోనా కూడా అంతే.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు అంటించేస్తుంది.. ఆయన సభకు వచ్చిన సామాన్య ప్రజానీకానికి కూడా వ్యాపిస్తుంది. అందుకే ‘కరోనాను’ ఇప్పుడు యూనివర్సల్ వైరస్ గా ప్రకటించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.

ఇంతకీ ఈ సోది అంతా ఎందుకంటే.. కేసీఆర్ అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఆయనను చూసి అందరూ భయపడుతారు.. వైద్య రంగంలోని ప్రముఖులంతా ఆయన ఫాంహౌస్ కే వచ్చి చికిత్స చేస్తారు. కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆయన సాగర్ లో నిర్వహించిన సభలకు వచ్చిన వారికి ఇప్పుడు పెద్ద ఎత్తున కరోనా సోకిందట. అంతేకాదు.. వారి కుటుంబాలకు తీవ్రంగా పాకిందట.. నాగార్జున సాగర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసీఆర్ సభకు వచ్చిన వారి కుటుంబాల్లో ఇప్పుడు కరోనా కల్లోలం చోటుచేసుకుందట..

అక్కడే కాదు.. నిన్న యశోద ఆస్పత్రికి వచ్చిన సమయంలోనూ కేసీఆర్ కేవలం మాస్క్ పెట్టుకొని మాత్రమే కారులో కనిపించాడు. నిజానికి కరోనా సోకి టెస్టులకు వచ్చిన కేసీఆర్ అలా రాకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అంబులెన్స్ లేదంటే.. కేవలం ఒక రోగి మాత్రమే ఉండే ప్రత్యేక బస్సు లేదా పీపీఈ కిట్ తొడుక్కొని వైరస్ ఇతరులకు వ్యాపించకుండా రావాలి. కానీ కేసీఆర్ కారులో పక్కనే డ్రైవర్.. వెనుకలా భద్రతా సిబ్బంది కనిపించారు. అంటే కరోనా రోగితో అంత సన్నిహితంగా ఉంటే వారికి డేంజర్.

అంతదాకా ఎందుకు.. కేసీఆర్ ను నీడలా వెంటాడే ఆయన సడ్డకుడి కొడుకు.. రాజ్యసభ ఎంపీ సంతోష్ సైతం ఈరోజు కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్ గా తేలింది. అంటే కేసీఆర్ పక్కనే ఉండే అతడు కూడా కరోనా బారినపడ్డాడు.

దీన్ని బట్టి కేసీఆర్ కరోనా బాధితుడిగా మారడమే కాదు.. ఆయన వల్ల ఇప్పుడు చాలా మందికి కరోనా అంటించినట్టు అయ్యిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ను ఈ విషయంలో కార్నర్ చేసేస్తున్నారు.