
దేశంలో కలకలం రేపిన హత్రాస్ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హత్రాస్ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హత్రాస్ ఘటనలో చనిపోయిన మహిళ అంత్యక్రియలను రాత్రికి రాత్రే తల్లి తండ్రులు లేకుండా జరిపించడం, అత్యాచారం జరగలేదని మెడకు తగిలిన గాయంతో మరణించిందని ప్రకటన చెయ్యడం లాంటి సంఘటనలతో దేశ వ్యాప్తంగా దూమారం చెలరేగింది. దీనితో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.