
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు. రఘురామ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు తాజాగా ఇవాళ నోటీసులు జారీ చేసింది. రఘురామ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని జగన్, సీబీఐకీ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.