
కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరత, మందులు, వ్యాక్సిన్ల అంశాన్ని సుమోటగా స్వీకరించి విచారణ చేపడుతున్న సుప్రీం కోర్టు మంగళవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు చేయాల్సిన కొన్ని జాతీయ సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో కోర్టు ఓ మౌన ప్రేక్షకుడిలా కూర్చోలేదు అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తాము హైకోర్టుల విచారణలకు అడ్డుపడటం లేదని వాటికి సహాయక పాత్రను తాము పోషిస్తామని ధర్మాసనం తెలిపింది.