
ఆసియాలోనే 2వ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి గా గుర్తింపు వున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ని తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యే ప్రారంభించిన విషయం విదితమే. అయితే వారాంతాల్లో సందర్శకులను దీనిపైకి అనుమతించలేమని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వారాంతాల్లో ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో భద్రత, ట్రాఫిక్ వంటి సమస్యలు తలెత్తడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10గంటల నుండి సోమవారం ఉదయం 6గంటల వరకు ఈ నిబంధనలు వర్తించనున్నట్లు తెలిపారు.