
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపు, వానాకాలం పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితరాలపై చర్చించనున్నారు. లాక్ డౌన్ గడువు ఈరోజుతో ముగియనుండటంతో దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వైద్యారోగ్య, పోలీస్ శాఖకు నిధులు పెంచే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.