
హైదరాబాద్ నగరంలోని హఫీజ్ పేట్ లో దారుణ హత్య జరిగింది. హఫీజ్ పేట్ లో నివాసముంటున్న క్యాబ్ డ్రైవర్ మహ్మద్ ఫరీద్ (35) ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. క్యాబ్ డ్రైవర్ మృతదేహం హాఫీజ్ పేట్ బ్రిడ్జి కింద లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పోలీసులు స్వాథీనం చేసుకుని, పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రెండు రోజుల క్రితం ఫోన్ రాగానే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్నట్లు తమకు చెప్పినట్లు కుంటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.