
మణిపూర్ రాష్ట్రంలో ఖాళీగా వున్న 3నియోజకవర్గాల ఉపఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7న ఎన్నికలు జరగగా 10న ఫలితాలు రానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను, పండుగలను, వాతావరణం, కరోనా వ్యాప్తి లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని తేదీలను ప్రకటించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మణిపూర్‌లోని వాంగోయి, సైతు, సింఘాట్ల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వచ్చే నెల 7న జరుగనున్నాయి.