హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిన్నౌర్ జిల్లాలోని రెకాంగ్ పియో- సిమ్లా హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల కింద పలు వాహనాల్లో సుమారు 40 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కిన్నౌర్ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడించారు. సమాచారమందుకున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.