ప్రస్తుతం ఏ చిన్న బలమైన సంఘటన జరిగినా.. కొందరు సమాజంలో బలమైన ముద్ర వేసిన ఎవ్వరూ కనపడినా వారి జీవితాన్ని తరిచి చూసి కథ రాసి బయోపిక్ గా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన వారి బయోపిక్ లకు కూడా రంగం సిద్ధం అవుతున్నాయి.
టాలీవుడ్ లో కథల కొరత ఉందన్న మాట వాస్తవం. ఆ కథల కొరత తీరాలంటే ఏదో ఒకటి వెతకాలి. సంచలనాలను వెలికి తీయాలి. అలా ఏపీలో స్టువర్ట్ పురం దొంగలు ఎప్పుడూ ఫేమసే.. వారి దొంగతనాలు ఏపీని షేక్ చేశాయి. కొందరు మంచి దొంగల కథ కూడా స్టువర్టుపురంలో ఉంది.
తాజాగా స్టువర్ట్ పురంలో పేరుగాంచిన దొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. మొదటి ఈ కథకు రానా, రవితేజను అనుకున్నారు. కానీ చివరకు ఈ ఘారాన దొంగ పాత్ర యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు దక్కింది.
స్టువర్ట్ పురం దొంగ పాత్రలో హీరో బెల్లంకొండను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు ‘స్టువర్ట్ పురం దొంగ’ అనే టైటిల్ నే ఫిక్స్ చేయడం విశేషం. కేఎస్ దర్శకుడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
1970వ దశకంలో స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు చేసి దొంగతనాలు హైలెట్ గా నిలిచాయి. చెప్పి మరీ దొంగతనాలు చేసిన చరిత్ర టైగర్ నాగేశ్వరరావుది. అందుకే అతడి కథనే ఇప్పుడు బయోపిక్ గా తీస్తున్నారు. ఆ పాత్ర బెల్లంకొండకు దక్కింది. ఇక ప్రస్తుతం హిందీలో ‘చత్రపతి’ తీస్తున్న బెల్లంకొండ అది పూర్తయ్యాక ఈ సినిమాలో పాల్గొంటారు.