
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. వెంకటేశ్వరస్వామి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి నియామకంపై రెండో భార్య మారుతో మహాలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవలే వెంకటాద్రిస్వామి పేరును పీఠాధిపతిగా ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో వెంకటాద్రిస్వామి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టే తరుణంలో హైకోర్టును ఆశ్రయించారు.