
ఈమధ్య తమిళ స్టార్ హీరోల ఇళ్లకు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ మద్య ఒకసారి రజినీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో హుటాహుటిన పోలీసులు జాగిలాలు, బాంబు స్క్వాడ్ తీసుకుని రజనీకాంత్ ఇంటికి వస్తే అక్క ఏం లేదు. తీరా చూస్తే ఒక చిన్న పిల్లాడు చేసిన ఆకతాయి పని అది. తాజాగా స్టార్ హీరో అజిత్ ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అప్రమత్తమైన స్థానిక పోలీసులు బాంబు స్క్వాడ్ తో పాటు జాగిలాలను కూడా తీసుకుని అజిత్ ఇంటికి వెళ్లారు. అక్కడ అలాంటిదేమీ లేదు. బాంబు బెదిరింపు కేవలం ఆకతాయిలు చేసిన పని అని తేలింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.