Bomb Threat: కర్ణాటకలోని బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రమానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బింది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయ భద్రతా విభాగానికి బుధవారం రాత్రి ఒక మెయిల్ వచ్చింది. దానిలో దుండుగుడు తాను ఉగ్రవాదినని పేర్కొంటూ, విమానాశ్రయంలో రెండు బాంబులు పెట్టినట్లు తెలిపాడు. విమానాశ్రయంలోని టాయిటెల్ వైపులో మరో పేలుడు పరికరం అమర్జినట్లు బెదిరించాడు. పోీలీసులు తనిఖీ చేసి నకిలీ బెదిరింపు అని తేల్చారు.