
ఈ నెల 26న వినీలాకాశంలో బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. భూమికి దగ్గరగా రావడంతో పాటు సాధారణ రోజుల్లో కంటే చంద్రుడు పెద్దగా కనిపించనున్నాడు. ఎరుపు, నారింజ రంగుల్లో దర్శనమివ్వనున్నాడు. ఈ ఏడాదిలో మొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం ఇదే. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, అమెరికాల్లో కనిపిస్తుంది. భారత్ లో పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బ్లడ్ మూన్ పాక్షికంగా కనిపిస్తుంది. మళ్లీ జూన్ 10న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది.