
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద రైతులకు ఎనిమిదో విడత ఆర్థిక సాయన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 14న విడుదల చేస్తారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటకు జరుగుతుంది. సుమారు 9.5 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 19 వేల కోట్లకు పైగా అందజేస్తారు. ఈ వివరాలను గురువారం ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. పీఎం కిసాన్ పథకం క్రింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 2000 చొప్పున శుక్రవారం విడుదల చేస్తారు.