
కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాలని సీఎం ఆదేశించారన్నారు. పాజిటివ్ పేషెంట్ల గుర్తింపు కోసం ఫీవర్ సర్వే చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత పకడ్బంధీగా పీవర్ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.