
బీజేపీ ముఖ్యనేతల సమావేశం ముగిసిన వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ శామీర్ పేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లారు. తరుణ్ చుగ్ తో పాట బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, రఘునందనరావు, రాజాసింగ్, ఎంపీ సోయం బాపురావు, రామచంద్రరావు, ఏ. చంద్రశేఖర్, వివేక్ తదితరుల ఈటల నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. భాజపాలో ఈటలకు ఇవ్వబోయే ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు ఆయన నివాసానికి కమలనాథులు వెళ్లినట్లు సమాచారం. తన గన్ మెన్ కు కొవిడ్ పాజిటివ్ రావడంతో బండి సంజయ్ హోం క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో ఆయన ఈటల నివాసానికి వెళ్లలేకపోయారు.