
జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. వర్షాకాలంలో పూడిక తీత పనులు, అక్రమ కట్టడాలు తొలగించాలని డిమాండ్ చేశారు. గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. జూన్ నెల సగం రోజులు పూర్తయినా నాలాల పూడిక తీత, అక్రమ కట్టడాలు కూల్చివేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.