Bill Gates divorce : బిల్‌గేట్స్.. పరిచయం అక్కరలేని పేరు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుడు. ఇప్పటికీ ధనవంతుల జాబితాలో టాప్ టెన్‌లో ఉన్న వ్యక్తి. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బిల్‌గేట్స్.. సొంత ఇంటిని చక్కదిద్దడంలో విఫలమయ్యాడు. వివాహేతర సంబంధాలు, వ్యాపార కార్యకలాపాలతో 27 ఏళ్ల వైవాహిక బంధానికి కూడా స్వస్తి పలికాడు. తాజాగా ఆయన మాజీ భార్య మెలిండా బిల్‌గేట్స్‌తో విడాకులపై స్పందించారు. కీలక విషయం తెలిపారు.
ఆ విషయాల కారణంగానే..
ఎప్‌స్టీన్ కేసు ఫైల్స్‌లో బయటపడుతున్న విషయాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని మెలిండా గేట్స్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు 27 ఏళ్ల వైవాహిక జీవితం ముగింపుకు దారితీసాయని పరోక్షంగా వెల్లడించారు. ఆ ఘటనలు గుర్తొచ్చినప్పుడు తీవ్ర బాధ కలిగిస్తుందని ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ అనుభవాలు వైవాహిక బంధాన్ని వదులుకోవడానికి కారణమని స్పష్టం చేశారు. బిల్ గేట్స్ ఈ ఆరోపణలకు స్పందించాలని డిమాండ్ చేశారు.
ఎప్‌స్టీన్ కేసు నేపథ్యం
జెఫ్రీ ఎప్‌స్టీన్ లింక్‌లు బిల్ గేట్స్ పలువురితో వివాహేత సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫొటోలు, రిపోర్టు విడుదల చేసింది. ఈ కేసులో ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్‌తోపాటు చాలా మంది ఉన్నారు. అయితే ఈ వివాదం బిల్‌గేట్స్ దంపతులను విడదీసింది.
మెలిండా నిర్ణయం మహిళల స్వాతంత్య్రానికి చిహ్నంగా మారవచ్చు. బిల్ స్పందన ఎలా ఉంటుందో గమనించాలి. ఫిలాంథ్రాపీలో వారి సంయుక్త ప్రయత్నాలు ఇప్పుడు ప్రశ్నార్థకమవుతున్నాయి.