
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ ను తమ సీఎం అభ్యర్థిగా నిర్ణయించుకున్నారు. మొత్తం 243అసెంబ్లీ స్థానాలకు గాను 144సీట్లలో జనతాదళ్, 70సీట్లలో కాంగ్రెస్, సిపిఐ 6, సీపిఎం 4 స్థానాలలో పోటీ చేయనున్నాయి. ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు.