
2022 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. ఆరు ట్రిలియన్ డాలర్లతో ఆయన బడ్జెట్ ను రూపొందించారు. సంపన్న అమెరికన్లపై భారీ స్థాయిలో పన్నులు వసూలు చేయనున్నారు. కార్పొరేట్ పన్నును 28 శాతానికి పెంచనున్నారు. దండిగా సంపాదిస్తున్న అమెరికన్లపై 39.6 శాతం ఆదాయపన్ను వసూలు చేయనున్నారు. ప్రతిపాదిత బడ్జెట్ లో పలు రకాల సామాజిక పథకాలను కూడా చేర్చారు. వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ను కూడా పెంచారు.