
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భగత్ సింగ్ నాటకం ప్రదర్శించేందుకు రిహార్సల్స్ చేస్తుండగా పదేండ్ల బాలుడు ఉరివేసుకునే క్రమంలో మరణించాడు. ఈ ఘటన యూపీలోని బదౌన్ జిల్లా బబత్ గ్రామంలో వెలుగుచూసింది. భూరే సింగ్ కుమారుడైన శివరామ్ ఇతర పిల్లలతో కలిసి రిహార్సల్స్ చేస్తూ భగత్ సింగ్ ఉరితీత సీన్ ను ప్రదర్శించేందుకు శివం తన మెడచుట్టూ ఉచ్చు బిగించుకున్నాడు. తాను నిలుచున్న స్టూల్ పడిపోవడంతో ఉరిబిగుసుకుని బాలుడు మరణించాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సంకల్స్ శర్మ తెలిపారు.