
మా కస్టమర్లకు మేము ఎలాంటి మెయిల్స్ పంపించడం లేదని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మోసపూర్తి ఈమెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు నుంచి వచ్చే ఈ మెయిల్స్ లాగానే కొందరు తప్పుడు మెసేజ్‌లు పెడుతున్నారన్నారు. మెయిల్స్ లింకులపై క్లిక్ చేసేటప్పుడు ఆలోచించాలని, అనుమానం వస్తే బ్యాంకులో సంప్రదించాలన్నారు. ఎస్‌బిఐ బ్యాంక్ నుంచి వచ్చే తప్పుడు మెయిల్స్ ఎలా ఉంటాయో ఎస్పీఐ తన ట్విట్టర్‌లో ఉంచింది. వినియోగదారులు ఈ మెయిల్స్‌పై అవగాహన ఉంచుకొని క్లిక్ చేయాలని సూచించారు.