
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రెమ్ డెసివర్, వ్యాక్సీన్, ఆక్సీజన్, ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో గానీ ఏ మాత్రం లోపం రానీయవద్దని సీఎస్ కు సీఎం కేసీఆర్ సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గానూ సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిన కేసీఆర్ నియమించారు.