BCCI Cash Prize : ఊహించినట్టే టీమిండియా పై కనక వర్షం కురుస్తోంది. కష్టపడిన తత్వానికి.. చివర్లో లభించిన అదృష్టానికి బోనస్ అన్నట్టుగా టీమ్ ఇండియాకు బిసిసిఐ భారీ నజరానా ప్రకటించింది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో భారత క్రికెట్ మేనేజ్మెంట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. భారత క్రికెట్ మేనేజ్మెంట్ పెద్దలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా టీమిండియాను.. అభినందించారు. చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారని కొనియాడారు. పహల్గాం దాడికి మైదానంలో దీటుగా సమాధానం చెప్పారని ప్రశంసించారు.
3 blows.
0 response.
Asia Cup Champions.
Message delivered.21 crores prize money for the team and support staff. #AsiaCup2025 #INDvPAK #TeamIndia pic.twitter.com/y4LzMv15ZC
— BCCI (@BCCI) September 28, 2025
సాధారణంగా టీమ్ ఇండియా అతిపెద్ద విజయాలు సాధిస్తే మేనేజ్మెంట్ అభినందిస్తుంది. నగదు బహుమతితో సత్కరిస్తుంది. గత ఏడాది టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అందుకున్నప్పుడు కూడా ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇప్పుడు ఏకంగా ఆసియా కప్ లో విజయం సాధించిన తర్వాత టీం ఇండియా పై మేనేజ్మెంట్ కనక వర్షం కురిపించింది. వాస్తవానికి గతంలో ఆసియా కప్ సాధించినప్పుడు మేనేజ్మెంట్ ఈ స్థాయిలో ప్లేయర్లకు క్యాష్ ప్రైజ్ ప్రకటించలేదు. కానీ ఈసారి పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించిన నేపథ్యంలో మేనేజ్మెంట్ ఆనందంలో ఏకంగా 21 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. జట్టుకు, సపోర్టింగ్ స్టాఫ్ కు ప్రైజ్ మనీ పంచుతుంది.
ఆసియా కప్ ప్రైజ్ మనీ రెండు కోట్లు ఉంటే.. టీమిండియా మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రైజ్ మనీ ఏకంగా 21 కోట్లు ఉండడం విశేషం. దీనిని బట్టి క్రికెట్ కు.. ప్లేయర్లకు బీసీసీ ఎంతటి ప్రాధాన్యమిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఊపులో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవాలని.. సూర్య నాయకత్వంలో వరుస విజయాలు సాధించాలని అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం టీం ఇండియా దూకుడు చూస్తుంటే అది సాధ్యమవుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.. మరోవైపు భారత మేనేజ్మెంట్ ఆ స్థాయిలో నగదు బహుమతిని ప్రకటించడానికి నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. ఆటకు దక్కిన గౌరవం అంటూ పేర్కొంటున్నారు.