
కరోనా వైరస్ కారణంగా గతేడాది సరిగ్గా నిర్వహించలేకపోయిన దేశవాళీ క్రికెట్ ను బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో జరపడానికి సిద్ధమైంది. 2021-22 సీజన్ కు సంబంధించి అన్ని స్థాయిల టోర్నమెంట్లు, మ్యాచ్ లు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా మొత్తం 2,127 మ్యాచ్ ల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. నవంబర్ 16 నుంచి రంజీ ట్రోఫీ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.