Batch trailer: ఆకాష్ పూరి చేతుల మీదుగా ‘బ్యాచ్’ ట్రైలర్ విడుదల

ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా శివ దర్శకత్వంలో రఘు కుంచే సంగీత సారధ్యంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం బ్యాచ్. ఈ చిత్రం ట్రైలర్ ను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ గారి తనయుడు పూరి ఆకాష్ విడుదల చేసారు. ఈ సందర్భంగా పూరి ఆకాష్ మాట్లాడుతూ “ట్రైలర్ చూసా, చాలా ఆసక్తికరంగా ఉంది. రఘు […]

Written By: Suresh, Updated On : August 26, 2021 1:49 pm
Follow us on

ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా శివ దర్శకత్వంలో రఘు కుంచే సంగీత సారధ్యంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం బ్యాచ్. ఈ చిత్రం ట్రైలర్ ను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ గారి తనయుడు పూరి ఆకాష్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా పూరి ఆకాష్ మాట్లాడుతూ “ట్రైలర్ చూసా, చాలా ఆసక్తికరంగా ఉంది. రఘు కుంచే సంగీతం చాలా హైలైట్ గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. పాటలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈచిత్ర నిర్మాత సినిమాను థియేటర్ లోనే విడుదల చేస్తాను అంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో కూడా థియేటర్ లోనే విడుదల చేస్తాననటం గొప్ప విషయం, మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి కావాలి. సాత్విక్ చైల్డ్ యాక్టర్ గా చాలా సినిమాలు చూసాం. ఇప్పుడు హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా పాజిటివ్ గా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతు ఉంటాడు. అల్ ది బెస్ట్ సాత్విక్. ఈ సినిమా మంచి విజయం సాదించాలి” అన్నారు.