T20 World Cup 2026 : బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఇద్దరు హిందువులపై దారుణాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ ను తొలగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ కూడా కోల్ కతా యాజమాన్యానికి సూచనలు చేయడంతో.. అతడిని తొలగించింది. ఈ పరిణామం బంగ్లాదేశ్ కు ఇబ్బంది కలిగించింది.
బంగ్లాదేశ్ తో భారత్ సంబంధాలు కూడా అంత గొప్పగా లేవు. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇటీవల ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరితే.. భారత్ ఒప్పుకోలేదు. దీనికి తోడు బంగ్లాదేశ్ లో హిందువులపై దారుణంగా దాడులు జరుగుతున్నాయి. వీటిని భారత్ ఖండిస్తూ వస్తోంది. అందువల్లే కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ ను తొలగించింది.
ముస్తా ఫిజుర్ ను తొలగించిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంక, భారత్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో ఆడేందుకు బంగ్లాదేశ్ రాబోదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఐసీసీకి బంగ్లాదేశ్ ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ముస్తాఫిజుర్ ను తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఐసీసీ ఒకవేళ బంగ్లాదేశ్ జట్టుకు మినహాయింపు ఇస్తే… ఆ జట్టు పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్ శ్రీలంకలో తమ మ్యాచ్ లు మొత్తం ఆడాల్సి వస్తుంది.
టి20 వరల్డ్ కప్ నిర్వహణకు ఇంకా నెలరోజుల సమయం మాత్రమే ఉంది. మరొకటి బంగ్లాదేశ్ టి20 వరల్డ్ కప్ మ్యాచ్ వేదికలను మార్చాలని నిర్ణయాన్ని బీసీసీఐ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇదంతా ఒక పీడకల అని చెప్పుకొచ్చింది. ఐసీసీ దృష్టికి ఇదే విషయాన్ని బిసిసిఐ తీసుకెళ్ళింది. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు icc ఎదుట మూడు ప్రశ్నలు సంధించిందని తెలుస్తోంది. ముస్తాఫిజుర్ ను ఎందుకు తొలగించారు?, టి20 వరల్డ్ కప్ విషయంలో బంగ్లాదేశ్ ప్లేయర్లకు కల్పించే భద్రతపై అనుమానాలు ఉన్నాయి?, బంగ్లాదేశ్ ప్లేయర్లు మాత్రమే కాకుండా, మీడియా, ఫ్యాన్స్, స్పాన్సర్లు ప్రపంచ కప్ చూసేందుకు ఇండియాకు వస్తే పరిస్థితి ఏంటి? ఇలా మూడు ప్రశ్నలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఎదుట ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్ తో, 17న నేపాల్ తో ఆడుతుంది. ఈ నాలుగు మ్యాచ్లను శ్రీలంకలో జరపాలని బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.