
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 100 కిలోమీటర్ల పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన 100 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. కార్యకర్తలు ఇచ్చిన కత్తితో కేక్ కోశారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చారు.