
దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు, ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది. ఈ మేరకు మంగళవారం ఈసీ ఉత్వర్వులు జారీ చేసింది. ఇటీవల కేందర పాలిత ప్రాంతం సహా తమిళనాడు, కేరళ, అసోంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తకాగా పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో నూ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మే 2న తేదీన ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది.