Republic of Balochistan : దాయాది పాకిస్తాన్ దేశానికి దిమ్మ తిరిగిపోయింది.. బొమ్మ కనబడింది.. కొంతకాలంగా అక్కడి బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ సైనికులను అంతం చేస్తున్నారు. పాకిస్తాన్ లో భయంకరమైన బాంబు పేలుళ్లకు కూడా పాల్పడుతున్నారు. దీంతో పాకిస్తాన్ కొన్ని సందర్భాలలో వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఏమి చేయలేక చూస్తూ ఉండి పోవాల్సి వస్తోంది.
పాకిస్తాన్ దేశాన్ని అలా డిఫెన్స్ లో పడేసిన బలూచ్ తిరుగుబాటుదారులు ఇప్పుడు సరికొత్త ఆస్త్రాన్ని సంధించారు. పాకిస్తాన్ దేశంతో తమకు తాముగా స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. ఇకపై తమ ప్రాంతాన్ని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గుర్తించాలని స్పష్టం చేశారు.
బలూచ్ తిరుగుబాటుదారులు తమకు తాముగా స్వాతంత్ర్య ప్రకటన చేసిన అంత ఈజీగా ఇండిపెండెంట్ కంట్రీగా అది మారిపోదు. ఎందుకంటే ఇప్పటికీ ఆ ప్రాంతం పాకిస్తాన్ నియంత్రణలో కొనసాగుతోంది.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. స్వతంత్ర దేశాల హోదాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. గుర్తింపు సాధించడం అంత సులభం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే భౌగోళికంగా అంతర్జాతీయ గుర్తింపు సాధించాయి. తిరుగుబాటుదారులు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటికీ.. అది ఆ స్థాయిలో వ్యవహరించగలదా.. తనను తాను నిరూపించుకోగలదా.. ఇతర దేశాలు ప్రముఖంగా గుర్తించగలుగుతాయా.. అనేవి బలుచ్ సాధించే మనగడం మీద ఆధారపడి ఉంటాయి.
అంతర్జాతీయంగా 1933లో మాంటె విడియో కన్వెన్షన్ ప్రకారం ఒక దేశం సార్వభౌమ రాజ్యాంగ ఏర్పడినప్పుడు ముఖ్యంగా నాలుగు లక్షణాలను కలిగి ఉండాలి. అందులో ప్రధానమైనది స్థిరమైన జనాభా. రెండవది స్పష్టంగా ఉండే అంతర్జాతీయ సరిహద్దులు.. మూడవది సమర్థవంతంగా ఉండే ప్రభుత్వం.. నాల్గవది ఇతర దేశాలతో కొనసాగించే దౌత్యపరమైన సంబంధాలు . బలుజ్ ప్రాంతానికి జనాభాతో పెద్దగా ఇబ్బంది లేదు. దీని సరిహద్దులు పాకిస్తాన్.. ఆగనిస్తాన్ దేశాల తో విస్తరించి ఉన్నాయి. అలాంటప్పుడు సరిహద్దుల మీద నియంత్రణ కొనసాగించాలి.. ప్రజల అవసరాలు తీర్చుతూ ఉండాలి. ఇది తిరుగుబాటుదారుల వల్ల అవుతుందా అనేది చూడాలి.
ప్రపంచంలో ఇతర దేశాల నుంచి గుర్తింపు.. దౌత్యపరమైన సంబంధాలు లేకుండా బలుచ్ ఒక దేశంగా మనుగడ సాగించడం కష్టమవుతుంది. అంతర్జాతీయ గుర్తింపు సంస్థలలో సభ్యత్వం తీసుకోవడం.. విదేశాలలో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయడం.. పాస్పోర్ట్ కు సంబంధించి పొందాల్సిన గుర్తింపు.. ప్రపంచ బ్యాంకింగ్.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం… అంతర్జాతీయ ఒప్పందాలు… ప్రపంచ దేశాలతో దౌత్యపరమైన ఒప్పందాలు… ఇవన్నీ ఒక దేశానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాలు. తిరుగుబాటుదారులు బలూచ్ ప్రాంతానికి ఇవన్నీ సమకూర్చగలుగుతారా.. అనేది చూడాల్సి ఉంది..
ఇండిపెండెంట్ కంట్రీ గా బలూచ్ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నప్పటికీ.. భారత్ దానిని గుర్తిస్తుందా.. ప్రపంచ దేశాలు ఆమోదిస్తాయా అనేది చూడాల్సి ఉంది.. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్నప్పటికీ తిరుగుబాటుదారులు బలూచ్ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం.. అంటే మామూలు విషయం కాదు. ఇది పాకిస్తాన్ వైఫల్యానికి ఒక బలమైన నిదర్శనం.
