Balineni Srinivas Reddy : మాజీ మంత్రి బాలినేని భవితవ్యం ఏంటి? ఆయన పూర్తిస్థాయిలో జనసేనలో ఉంటారా? ఆయనకు ఆ పార్టీ అవకాశము ఇస్తుందా? టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఒంగోలు అసెంబ్లీ స్థానం ఆయనకు దక్కేనా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు బాలినేని. కానీ ఇప్పుడు అనామకుడిగా మారారు. కనీసం పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా కనీస పాత్ర లేకుండా ఉన్నారు. మరోవైపు ఆయన విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది. ఆయన వచ్చిన అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. దాని పైనే ఫుల్ క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించారు. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయంలో మరో ఆలోచన తావు లేదని తేల్చి చెప్పారు.
* జనసేనలో చేరిక..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన బాలినేని దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన సరే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి బాలినేనికి అవకాశం ఇవ్వలేదు. అయితే గౌరవం లేని చోట తాను ఉండలేనని భావించిన బాలినేని పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అయితే ఎమ్మెల్సీ హామీ తోనే ఆయన జనసేనలో చేరినట్లు ప్రచారం నడిచింది. కానీ కాలం గడుస్తున్న ఆ హామీ నెరవేరలేదు. మరోవైపు జనసేనలో కానీ.. కూటమిలో కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆశించిన గౌరవం దక్కడం లేదు. అందుకే ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ప్రచారం నడిచింది. కానీ అందుకు జగన్ సుముఖంగా లేరని తాజాగా తేలిపోయింది.
* పట్టించుకునే వారేరి?
ఏడాదిన్నర కిందట జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఎంతో ఆర్భాటంగా చేరుతారు అనుకుంటే కనీసం ఆయనకు ఆహ్వానం పలికేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన నేతలు ముందుకు రాలేదు. అందుకే కేవలం పవన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అయితే అనతికాలంలోనే జనసేనకు ఆయనకు ప్రాధాన్యత లభిస్తుందని అంతా భావించారు. జనసేనలో మాత్రమే కాదు కూటమిలో కూడా తగినంత గౌరవం దక్కడం లేదు బాలినేనికి. అయితే జనసేనలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పై చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు వైసీపీలో చేరుతారని ప్రచారం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఒంగోలులో తమ నాయకుడు చండూరి రవి అని తేల్చేశారు. జిల్లా నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అని కూడా తేల్చి చెప్పారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు.