
భారత్ రెజ్లర్ బజరంగ్ పునియా అద్భుతం చేశాడు. పురుషుల 65 కిలోల కుస్తీ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ప్లేఆఫ్ పోటీల్లో కజక్ స్థాన్ కు చెందిన దౌలత్ నియజ్ బోకోవ్ ను 8-0 తో చిత్తు చేశాడు. ఈ పోరులో బజరంగ్ పూర్తిగా అధిపత్యం చలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు రక్షణాత్మకంగా ఆడుతూనే మరోవైపు దూకుడు ప్రదర్శించాడు. ప్రత్యర్ధికి తన కాళ్లు అందకుండా జాగ్రత్తపడ్డాడు. మొదటి పీరియడ్ లో బజరంగ్ కు 1,1 చొప్పున రెండు పాయింట్లు వచ్చాయి. ఇక రెండో పీరియడ్ లో బజరంగ్ దుమ్మురేపాడు. ప్రత్యర్థి కాళ్లను పట్టుకొని రింగు బయటకు నెట్టేశాడు. వరుసగా 2,2,2, పాయింట్లు సాధించి తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. 8-0తో విజయం అందుకున్నాడు.