Homeబిజినెస్Bajaj Chetak EV : 14 రోజుల్లోనే అత్యధిక అమ్మకాలు.. టీవీఎస్ ను కొట్టేసిన బజాజ్...

Bajaj Chetak EV : 14 రోజుల్లోనే అత్యధిక అమ్మకాలు.. టీవీఎస్ ను కొట్టేసిన బజాజ్ చేతక్.. ఏం రేంజ్ లో అంటే

Bajaj Chetak EV : మార్కెట్లో ఎప్పుడూ కొత్త ఉత్పత్తులతో ఆటోమోబైల్ రంగం కళకళలాడుతోంది. ముఖ్యంగా Electric Vehicles (EV) ను మార్కెట్లోకి తీసుకువచ్చి విక్రయించడంలో కంపెనీలు ఒకదానికంటే మరొకటి ముందుంటున్నాయి. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో TVS కంపెనీ పై చేయి సాధించింది. అయితే ఇప్పుడు దీనిని అధిగమించడానికి బజాజ్ పోటీ పడుతుంది. మరికొన్ని అమ్మకాలతో నెంబర్ వన్ స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇదంతా కేవలం 14 రోజుల్లోనే జరగడం విశేషం. ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు బజాజ్ చేత విక్రయాలు చూసి అంతా షాక్ అవుతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Bajaj కంపెనీకి చెందిన Chetak e-2W OEM C2501 స్కూటర్లు ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు 11,943 యూనిట్లను విక్రయించింది. మరో 3,167 యూనిట్ల విక్రయాలు జరిగితే TVS కంటే పై చేయి సాధిస్తుంది. టీవీఎస్ మోటార్ అండ్ కో ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు 15,943 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. బజాజ్ చేతక్ 2025 ఏప్రిల్ ఒకటి నుంచి ఫిబ్రవరి 14 వరకు 11, 49,474 విక్రయాలు జరిపింది. మరో 1,292 యూనిట్లు అమ్ముడుపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక రిటైల్ అమ్మకాలు సాధించిన కంపెనీగా పేరు తెచ్చుకుంటుంది.

అటు TVS కంపెనీ సైతం తన దూకుడును కొనసాగిస్తోంది. ఈ కంపెనీ మొత్తం తన వాహనాలను ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు 52,007 యూనిట్లు విక్రయించింది. ఇందులో 15,110 ఐ క్యూబ్, ఆర్బిటర్ లు ఉన్నాయి. దీంతో ఈవీలు 29% వాటాను కలిగి ఉన్నాయి. కస్టమర్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టీవీఎస్ e 2w వాటాను విస్తరించాలని అనుకుంటోంది. నెలలో 30 వేల ఐ క్యూబ్ లను, 10,000 వరకు ఆర్బిటర్లను తయారు చేస్తోన్న ఈ కంపెనీ దీర్ఘకాలికంగా ఈవీ అమ్మకాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తోంది.

వీటితోపాటు ఐతేర్ కంపెనీ సైతం తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు ఈ కంపెనీ 9,505 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. దీంతో ఇది రిటైల్ మార్కెట్లో 18 శాతం మార్కెట్ వాటాను సాధించింది. నెలవారి అమ్మకాల్లో 70% మార్కెట్ వాటాను కలిగి ఉంది. అలాగే ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ 14 రోజుల్లో 2,160 యూనిట్ల అమ్మకాలు జరుపుకుంది. ఇది తొలిసారి ఆరవ స్థానానికి చేరడం విశేషం. అయితే ఓలా తిరిగి తన స్థానాన్ని చేరుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది..

వాహనదారుల్లో ఎక్కువగా ఈవీల కొనుగోలుపై ఆసక్తి పెరగడంతో ఈ కంపెనీలు తమ ఉత్పత్తులను అత్యధికంగా విక్రయించుకుంటున్నాయి. అంతేకాకుండా నేటి వినియోగదారులు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఈవీలను మాత్రమే కొనుగోలు చేయాలని చూస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular