https://oktelugu.com/

Malavika Mohanan Feels N@ked : అప్పుడు నగ్నంగా ఉన్నాను అనిపించింది !

Malavika Mohanan Feels N@ked: హీరోయిన్ మాళవిక మోహనన్ ( Malavika Mohanan) అంటేనే చాలా ఓపెన్ మైండెడ్ అని పేరు ఉంది. ఏ విషయాన్ని అయినా ఆమె డైరెక్ట్ చెప్పేస్తోంది. మనసులో ఒకటి నోటి నుండి మరొకటి మాట్లాడటం తనకు నచ్చదు అనే చెప్పే మాళవిక మోహనన్ తాజాగా బోల్డ్ కామెంట్స్ చేసింది. ‘ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పేస్ కి మాస్క్ పెట్టుకోవడం ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. అయితే, షూటింగ్ సమయంలో కూడా మాస్క్ […]

Written By:
  • admin
  • , Updated On : August 25, 2021 / 10:38 AM IST
    Follow us on

    Malavika Mohanan Feels N@ked: హీరోయిన్ మాళవిక మోహనన్ ( Malavika Mohanan) అంటేనే చాలా ఓపెన్ మైండెడ్ అని పేరు ఉంది. ఏ విషయాన్ని అయినా ఆమె డైరెక్ట్ చెప్పేస్తోంది. మనసులో ఒకటి నోటి నుండి మరొకటి మాట్లాడటం తనకు నచ్చదు అనే చెప్పే మాళవిక మోహనన్ తాజాగా బోల్డ్ కామెంట్స్ చేసింది. ‘ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పేస్ కి మాస్క్ పెట్టుకోవడం ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది.

    అయితే, షూటింగ్ సమయంలో కూడా మాస్క్ పెట్టుకొని నటించలేం కదా. లాస్ట్ వీక్ నేను ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూటింగ్ అవుట్ డోర్ లొకేషన్ లో జరిగింది. అవుట్ డోర్ కాబట్టి షూటింగ్ చూడటానికి జనం విపరీతంగా వచ్చారు. వాళ్ళను కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. దాంతో ఇక చేసేది ఏం లేక వారి మధ్యలోనే షూటింగ్ చేయాల్సి వచ్చింది.

    అయితే, నాకు మాత్రం అంతమంది జనం మధ్యలో ఎలాంటి మాస్క్ లేకుండా నటిస్తూ ఉంటే.. నగ్నంగా ఉన్నాననే భావన కలిగింది. అంతలా మాస్క్ మన డ్రెస్సింగ్ లో ఒక భాగం అయిపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అంటూ మాళవిక మోహనన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పై విధంగా చెప్పుకొచ్చింది.

    ఏది ఏమైనా మాళవిక మోహనన్ చాలా బోల్డ్. ఏ విషయాన్ని అయినా బోల్డ్ గానే చెబుతూ ఉంటుంది. కాకపోతే.. మాస్క్ పెట్టుకోకపోతే నగ్నంగా ఉన్నట్లు ఉంటుంది అని చెప్పేంత బోల్డ్ అని జనం కూడా ఊహించలేదు. ఇక ఈ మధ్య మాళవిక హాట్ ఫోటో షూట్ లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రతి హీరోయిన్ ఫోటో షూట్స్ చేస్తోంది అనుకోండి. కానీ మాళవిక తీరే వేరు లేండి.