టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లపై మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో దళిత బంధు ఇస్తామని చెప్పిన కేసీఆర్ తన దత్తత గ్రామము వాసలమర్రి లో ఇవ్వలేక పోయారని అన్నారు. పీఎం ను కేసీఆర్ కలవగానే హుజురాబాద్ ఎన్నికలు వాయిదా పడ్డాయని విమర్శించారు. ఇక్కడ బీజేపీ, టిఆర్ఎస్ లు కలిసి లోపాయికరిగా పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుందని తెలిపారు. జీవన్ రెడ్డి ఎన్ని పిగ్గిమొగ్గలు వేసినా రేవంత్ రెడ్డి ని ఏమి చేయలేరని అన్నారు. దుబాయ్ పాస్ పోట్ల బ్రోకర్.. దుబాయ్ పాండు జీవన్ రెడ్డి పార్క్ హయత్ లో లెక్సరీ సూట్ లో ఏం చేస్తుంటారో తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు.