Australia vs South Africa T20 : ఇటీవల వెస్టిండీస్ లో పర్యటించి.. ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ను వైట్ వాష్ చేసింది కంగారు జట్టు. ప్రస్తుతం ఆ జట్టు మార్ష్ ఆధ్వర్యంలో సఫారీ గడ్డపై పర్యటిస్తోంది. సఫారి జట్టుతో మూడు టి20 లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందులో భాగంగా ముందుగా టి20 సిరీస్ మొదలైంది. తొలి టి20 మ్యాచ్ ఆదివారం డార్విన్ వేదికగా జరిగింది.
ఈ మ్యాచ్ లో భాగంగా కంగారు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 75 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కంగారు జట్టును టిమ్ డేవిడ్(83), గ్రీన్(35) ఆదుకున్నారు. ఫలితంగా కంగారు జట్టు 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. సఫారి జట్టు బౌలర్లలో మపాక నాలుగు వికెట్లు పడగొట్టాడు. రబాడ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు.
179 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన సఫారీ జట్టు 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారి జట్టులో రికెల్టన్ (71), స్టబ్స్(37) పరుగులు చేశారు.. ఒకానొక దశలో 120/4 వద్ద ఉన్న సఫారి జట్టు.. మిగతా 5 వికెట్లను 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం విశేషం. కంగారు జట్టులో హేజిల్ వుడ్ , బెన్ ద్వార్ష్ యిష్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. జంపా రెండు వికెట్లు సాధించాడు.
ఈ మ్యాచ్లో కంగారు జట్టు ఆటగాడు మాక్స్ వెల్ బౌండరీ లైన్ దాటి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. తద్వారా మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేశాడు. హేజిల్ వుడ్ బౌలింగ్ లో జార్జ్ లిండే(0) భారీ షాట్ కొట్టాడు. అది సిక్సర్ దిశగా వెళ్తుండగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మాక్స్వెల్ అమాంతం ఆ బంతిని అందుకున్నాడు.. ఆ తర్వాత గాల్లోకి ఎగిరేసి.. బౌండర్ లైన్ ఇవతలకి వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దీంతో లిండే నిరాశతో వెనుతిరిగాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. దీంతో కంగారు జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
JUST A NORMAL GLENN MAXWELL STUNNER AT THE BOUNDARY. pic.twitter.com/aCEqk6o35b
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 10, 2025