
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు సురక్షితంగా తమ దేశానికి చేరుకున్నారు. భారత్ లో కరోనా కల్లోలం నేపథ్యంలో ఐపీఎల్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ఆడేందుకు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు రెండు వారాల పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం సిడ్నీ చేరుకున్నారు. సుమారు 40 మంది ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహించారు. అయితే కోవిడ్ తో బాధపడుతున్న హస్సీ ఇంకా చెన్నైలోనే చికిత్స పొందుతున్నాడు. మే ఆరవ తేదీన ఆసీస్ క్రికెటర్లు మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే.