
కాంగోలోని గోమాలో అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 32 కు పెరిగింది. గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో లావాను చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు. మరో వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో దవాఖానలో చేరాడని అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి ప్రవహించిన లావా ఇళ్లను ముంచెత్తింది. దీంతో తొమ్మిది మంది దహనమయ్యారు. అదే విధంగా గోమా జైలు నుంచి ఖైదీలను తరలిస్తుంగా ట్రక్కు బోల్తాపడి 14 మంది మరణించారు.