Assam CM: సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేసిన నేపథ్యంలో బ్రహ్మపుత్ర నీటిన చైనా నిలిపివేస్తే మీ పరిస్థితి ఏంటి అంటూ పాక్ వ్యాఖ్యానించింది. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. బ్రహ్మపుత్ర ప్రవాహంలో చైనా నుంచి వచ్చేది 35 శాతం మాత్రమే. ఇండియాలో వర్షాల ద్వారానే ఆ నదికి 70 శాతం ఫ్లో వస్తుంది. ఈ నదిపై మేం ఆధారపడలేదు. ఒకవేళ చైనా నీటిని ఆపేస్తే అది మాకు మేలే. అస్సాంలో వరదలు తగ్గుతాయి అని ట్వీట్ చేశారు.