
దేశంలో కరోనా కల్లోలం వల్ల రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ వివిధ రంగాల వారితో కరోనా పరిస్థితిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వైద్యరంగ ప్రముఖులతో పాటు ఫార్మా పరిశ్రమ నిపుణులతో చర్చించిన ఆయన తాజాగా ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎం ఎం నరవానెతో కూడా ప్రధాని భేటీ అయ్యారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆర్మీ ఇప్పటికే పోషిస్తున్న ఇకపై షోషించాల్సిన పాత్ర గురించి ఈ సందర్భంగా చర్చించారు.