Arjun Reddy: 2017 వ సంవత్సరంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగు సినిమా చరిత్రని మార్చేసిందనే చెప్పాలి. అప్పటివరకు ఒక మూస ధోరణి లో సాగుతున్న సినిమా కథలని మార్చేసి సినిమా అంటే ఇలా కూడా తీయొచ్చు అనే ఒక డిఫరెంట్ జానర్లో సినిమాని తెరకెక్కించి సక్సెస్ చేసిన ఘనత ఆ సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ కే దక్కుతుంది.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా తన పాత్రకి 100% న్యాయం చేశాడనే చెప్పాలి. ఇక వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇక ఇలాంటి కథలతోనే పాన్ ఇండియా లో ఇలాంటి చాలా సినిమాలు వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే అర్జున్ రెడ్డి సినిమాలో హీరో పాత్రని నాగార్జున హీరోగా పోషించిన రక్షకుడు సినిమా క్యారెక్టర్ ను చూసి డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నాగార్జున రక్షకుడు సినిమాలో షార్ట్ టెంపర్ అవుతూ ఉంటాడు. చిన్న విషయానికి కూడా ఆయనకు విపరీతంగా కోపం వస్తుంది.
అదే ఆయనకు మైనస్ అనుకుంటున్న సందర్భంలో అది కూడా కొన్నిసార్లు ప్లస్ అవుతుంది అంటూ ఆ డైరెక్టర్ ఆ సినిమాలో చూపించడం విశేషం. మరి ఇలాంటి క్రమంలోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నాగార్జున క్యారెక్టర్ ను చూసే ఈ సినిమాని చేశాడు అంటూ చాలా వార్తలైతే వచ్చాయి. ఇక ఈ సినిమా వచ్చిన తర్వాత అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమా కూడా వచ్చింది.
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చిన సమయంలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ని అర్జున్ రెడ్డి క్యారెక్టర్ తో పోలుస్తూ చాలా వరకు ఆ సినిమాను ట్రోల్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా అర్జున్ రెడ్డి సినిమా అనేది ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి…